శ్రీలంకలో షేర్ మార్కెట్ భారీ పతనం.. ట్రేడింగ్ నిలిపివేత

  • 5.9 శాతం పడిపోయిన సూచీలు
  • తాత్కాలికంగా నిలిచిన ట్రేడింగ్
  • కేబినెట్ కు ప్రధాని కుమారుడి రాజీనామా
అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న శ్రీలంకలో సోమవారం స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని చూసింది. ఉదయం 5.9 శాతం మేర సూచీలు పడిపోవడంతో వెంటనే కొలంబో స్టాక్ ఎక్సేంజ్ లో ట్రేడింగ్ ను నిలిపివేశారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేయనున్న తరుణంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. 

మరోవైపు శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుమారుడు నమల్ రాజపక్స కేబినెట్ కు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. పలువురు ఇతర కేబినెట్ సభ్యులు కూడా రాజీనామాలతో ముందుకు వచ్చారు. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా అల్లర్లు పెరిగిపోవడంతో వీటి నియంత్రణకు వీలుగా ఎమర్జెన్సీని అధ్యక్షుడు విధించడం తెలిసిందే. పెరిగిపోయిన రుణ భారం, అడుగంటిన విదేశీ మారక నిల్వలతో చమురు కొనుగోలు చేయలేక, ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోలేక దీన పరిస్థితులను శ్రీలంక చవిచూస్తోంది.


More Telugu News