3 రాజ‌ధానులు, కొత్త జిల్లాల సంకల్ప ల‌క్ష్యం ఒక‌టే: విజ‌య‌సాయిరెడ్డి

  • కొత్త జిల్లాల ఏర్పాటుపై సాయిరెడ్డి ట్వీట్‌
  • అధికార వికేంద్రీక‌ర‌ణ కోస‌మే కొత్త జిల్లాల‌ని వ్యాఖ్య‌
  • 3 రాజ‌ధానుల ల‌క్ష్యం కూడా అదేన‌ని వెల్ల‌డి
ఏపీలో ఇప్పుడు 13 జిల్లాలకు అదనంగా మ‌రో 13 కొత్త జిల్లాలు ఏర్ప‌డ్డాయి. మొత్తంగా 26 జిల్లాలతో ఏపీ స‌రికొత్త ప్రస్థానాన్ని సోమ‌వారం నుంచి మొద‌లుపెట్టింది. సోమ‌వారం ఉద‌యం సీఎం జ‌గ‌న్ కొత్త జిల్లాల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ క్రమంలో, కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ల‌క్ష్యం ఏమిట‌న్న విష‌యంపై వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి కాసేప‌టి క్రితం ఓ ట్వీట్ సంధించారు.

ఈ ట్వీట్ ప్ర‌కారం అధికార వికేంద్రీక‌ర‌ణ ల‌క్ష్యంగానే ఏపీలో సీఎం జ‌గ‌న్ కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేశార‌ని సాయిరెడ్డి వివ‌రించారు. చిన్న జిల్లాల‌తో అధికారులు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతార‌ని చెప్పిన సాయిరెడ్డి.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌లులో న‌వ‌శకం మొద‌లు అవుతుంద‌ని చెప్పారు. ఇక త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న 3 రాజ‌ధానుల ల‌క్ష్యం కూడా అధికార వికేంద్రీక‌ర‌ణేన‌ని చెప్పిన సాయిరెడ్డి.. ఎవ‌రు వ్య‌తిరేకించినా త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్యం అధికార వికేంద్రీక‌ర‌ణేన‌ని తేల్చేశారు.


More Telugu News