దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో విలీనమవుతున్నట్టు ప్రకటించిన హెచ్డీఎఫ్సీ
  • 1,335 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 382 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో విలీనం అవుతున్నట్టు ఫైనాన్సింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ ప్రకటించడం మార్కెట్లలో జోష్ ను అమాంతం పెంచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,335 పాయింట్లు లాభపడి 60,611కి చేరుకుంది. నిఫ్టీ 382 పాయింట్లు పెరిగి 18,053 వద్ద స్థిరపడింది. ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి. ఫైనాన్స్ సూచీ 4.20 శాతం వరకు పెరిగింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (9.97%), హెచ్డీఎఫ్సీ (9.30%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.32%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.24%), ఎల్ అండ్ టీ (1.95%). 

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్ (-1.05%), టైటాన్ (-0.20%) నష్టాల్లో ముగిశాయి.


More Telugu News