నాకు వరుడు దొరికేశాడు: 'కొమురం పులి' హీరోయిన్ నికీషా పటేల్
- తనకు కాబోయే వాడు యూకేలో ఉంటున్నాడన్న నికీషా
- త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వ్యాఖ్య
- తన ఫేవరెట్ హీరో ధనుశ్ అని నెటిజన్లకు సమాధానం
దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ నికీషా పటేల్.. తెలుగులో పవన్ కల్యాణ్ సరసన 'కొమురం పులి' సినిమాలోనూ నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఛాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది.
ఈ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా స్పందించింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ... తనకు వరుడు దొరికేశాడని, తనకు కాబోయే వాడు యూకేలో ఉంటున్నాడని నికీషా తెలిపింది. తాము త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వివరించింది.
కాగా, హీరో మహేశ్‌బాబు గురించి అభిప్రాయం ఏంటి? అన్న ప్రశ్నకు ఈ అమ్మడు స్పందిస్తూ.. ఫెయిర్ అండ్ లవ్లీ అని సమాధానం ఇచ్చింది. ఇక ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని, చాలా పొడుగ్గా ఉంటాడని పేర్కొంది. రజనీ కాంత్ కింగ్ అని, తన ఫేవరెట్ హీరో ధనుశ్ అని తెలిపింది.
పవన్ కల్యాణ్ గడ్డం అంటే తనకు ఇష్టమని పేర్కొంది. అయితే, మెగాస్టార్ గురించి మీ అభిప్రాయం ఏంటని అడిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. సినీ పరిశ్రమలో చాలామంది మెగాస్టార్లు ఉన్నారని, ఏ మెగాస్టార్ గురించి అడుగుతున్నారని ప్రశ్నించింది. దీంతో మెగాస్టార్ అంటే ఎవరో తెలీదా? అని కొందరు ఫ్యాన్స్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తోనూ నటించావు కదా? అని నిలదీశారు.
పవన్ కల్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి అన్న విషయం తెలియదా? అని కొందరు నెటిజన్లు అడిగారు. అందుకే ఆమెకు తెలుగులో సినిమా అవకాశాలు రావడం లేదని విమర్శించారు. దీంతో నికీషా స్పందిస్తూ... సినీ పరిశ్రమలో సల్మాన్ ఖాన్, మమ్ముట్టిని కూడా మెగాస్టార్ అని అంటారని చెప్పింది. కాగా, నెటిజన్లు ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని కొందరు కామెంట్లు చేశారు.