చెన్నైలో 'బీస్ట్'ను బీట్ చేసిన 'కేజీఎఫ్ 2'

  • ఈ నెల 13న విడుదలైన 'బీస్ట్'
  • 14న రిలీజ్ అయిన 'కేజీఎఫ్ 2'
  • భారీ ఓపెనింగ్స్ తో మొదలైన సినిమాలు
  • చెన్నైలోను 'కేజీఎఫ్ 2' ముందడుగు   
ఒక వైపున 'కేజీఎఫ్ 2' .. మరో వైపున 'బీస్ట్' ఒకరోజు తేడాతో థియేటర్లలో దిగిపోయాయి. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 60 సినిమాలకి పైగా చేసిన హీరో విజయ్ .. 20 సినిమాల లోపే చేసిన హీరో యష్. అయినా 'బీస్ట్' సినిమాకి 'కేజీఎఫ్ 2' పోటీ అవుతుందని కొంతమంది భావించారు.

విజయ్ తన సినిమాను వాయిదా వేసుకోనున్నాడనే ప్రచారం కూడా జరిగింది. కానీ విజయ్ వెనకడుగు వేయలేదు. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్లలో వస్తున్నాయి గనుక, వసూళ్లపై అంతగా ప్రభావం ఉండదని విజయ్ భావించాడు. కానీ చెన్నై సిటీలో సోమవారం వసూళ్లలో 'బీస్ట్'ను 'కేజీఎఫ్ 2' అధిగమించిందనేది కోలీవుడ్ సమాచారం.

సోమవారం చెన్నై సిటీలో 'బీస్ట్' 36 లక్షలను వసూలు చేస్తే, 'కేజీఎఫ్ 2' 62 లక్షలను రాబట్టింది. యష్ తో పాటు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కి విపరీతమైన ఇమేజ్ ఉండటం .. ఆల్రెడీ ఫస్టు పార్టు సంచలన విజయాన్ని నమోదు చేయడం ఒక కారణమైతే, కథా కథనాల పరంగా 'బీస్ట్' వీక్ గా ఉండటాన్ని మరో కారణంగా చెబుతున్నారు.


More Telugu News