ల్యాప్ టాప్ పేలుడు ఘటన విషాదాంతం... చికిత్స పొందుతూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుమలత మృతి
- కడప జిల్లాలో ఘటన
- వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్న సుమలత
- షార్ట్ సర్క్యూట్ తో పేలిన ల్యాప్ టాప్
- తీవ్ర గాయాలపాలైన సుమలత
- ఈ మధ్యాహ్నం కన్నుమూత
ఇటీవల కడప జిల్లా మేకవారిపల్లెలో సుమలత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ల్యాప్ టాప్ పేలడంతో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, సుమలత చికిత్స పొందుతూ కన్నుమూసింది. 22 ఏళ్ల సుమలత బెంగళూరులోని మ్యాజిక్ టెక్ సొల్యూషన్ అనే ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటివద్ద నుంచే పనిచేస్తుండగా, గత సోమవారం ల్యాప్ టాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ల్యాప్ టాప్ పేలడంతో పాటు, విద్యుదాఘాతంతో సుమలత తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
దాంతో ఆమెను కుటుంబసభ్యులు కడప సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమె పరిస్థితి క్షీణించడంతో రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న సుమలత పరిస్థితి విషమంగా మారినట్టు రిమ్స్ వైద్యులు గుర్తించారు. చికిత్స పొందుతూ సుమలత నేటి మధ్యాహ్నం కన్నుమూసింది. దాంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.