ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు సౌదీ అరేబియా ఆమోదం

  • హజ్ యాత్రకు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు
  • కరోనా నేపథ్యంలో ఈసారి పరిమితంగానే అనుమతి
  • 79,237 మందిని అనుమతించిన సౌదీ అరేబియా
  • జులై 7 నుంచి హజ్ యాత్ర
ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లడం ఇస్లాం మత ధర్మాల్లో ఒకటి. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది పలు షరతులతో హజ్ యాత్రకు సౌదీ అరేబియా ఆమోదం తెలిపింది. భారత్ నుంచి 79,237 మందికి  మాత్రమే హజ్ యాత్రకు అనుమతి నిచ్చింది. పరిస్థితుల దృష్ట్యా 65 ఏళ్లకు పైబడిన వారికి హజ్ యాత్రకు అనుమతి నిరాకరించింది. 

అంతేకాదు, హజ్ యాత్రకు వచ్చేవారు 2 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు నిర్ధారణ పత్రం, కరోనా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు వెంట తీసుకురావాల్సి ఉంటుందని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది హజ్ యాత్ర జులై 7న మొదలై 12వ తేదీన ముగియనుంది.


More Telugu News