'అందుకే ఓడిపోయాం'.. ముంబై ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందన
- తమ బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారన్న రోహిత్
- వారు నిర్లక్ష్యంగా షాట్లు కొట్టారని వ్యాఖ్య
- బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ ఉందన్న కెప్టెన్
- ఈ సీజన్ తమకు అస్సలు కలిసి రావడం లేదని ఆవేదన
ఐపీఎల్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లయింది. దీనిపై ముంబై జట్టు సారథి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ... తమ బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారని చెప్పాడు.
వారు నిర్లక్ష్యంగా షాట్లు కొట్టడం తమకు నష్టం తెచ్చిపెట్టిందని అన్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ ఉన్నప్పటికీ తమ బౌలర్లు మాత్రం బాగా రాణించారని తెలిపాడు. తమ ముందు లక్నో జట్టు ఉంచిన లక్ష్యం ఎక్కువేమీ కాదని అన్నాడు. తమ బ్యాట్స్‌మెన్‌లో ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.
అయితే, లక్నో ప్రత్యర్థి జట్టులోని బ్యాటర్లు ఇలాంటి బాధ్యత తీసుకున్నారని, దీంతో తమకు ఓటమి తప్పలేదని చెప్పాడు. ఏమైనా, ఈ ఐపీఎల్ సీజన్ తమకు అస్సలు కలిసి రావడం లేదని ఆయన అన్నాడు. ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని తెలిపాడు.