హైద‌రాబాద్ చేరుకున్న ఝార్ఖండ్ సీఎం.. సాయంత్రం కేసీఆర్‌తో భేటీ

  • కేసీఆర్‌తో భేటీ కోస‌మే హైద‌రాబాద్‌కు సోరెన్‌
  • జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌
  • థ‌ర్డ్ ఫ్రంట్ దిశ‌గానూ చ‌ర్చలు జ‌ర‌ప‌నున్న నేత‌లు
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధ్య‌క్షుడు, ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ గురువారం హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. గురువారం మ‌ధ్యాహ్నం ఆయ‌న హైద‌రాబాద్ స‌మీపంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంత‌రం సాయంత్రం ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు.

కేసీఆర్‌తో భేటీ సంద‌ర్భంగా జాతీయ రాజ‌కీయాల‌పై ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిపైనా ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించ‌నున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ప్రత్యామ్నాయంగా కూట‌మి క‌ట్టే దిశ‌గా కేసీఆర్ ఆలోచ‌న చేస్తుండ‌గా.. దానిపైనా హేమంత్ సోరెన్ చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు.


More Telugu News