హైదరాబాదులో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వర్షం... నగరజీవికి ఉపశమనం
- నగరంలో వేసవి తాపం
- పలు ప్రాంతాలలో వర్షం
- కొన్ని చోట్ల తీవ్రంగా ఈదురుగాలులు
అధిక వేడిమితో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు కాస్తంత ఉపశమనం కలిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అదే సమయంలో ఈదురుగాలులు కూడా వీచాయి.
ట్యాంక్ బండ్, హియాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, బీఆర్కే భవన్, పంజాగుట్ట, బేగంబజార్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, నాంపల్లి, సోమాజిగూడ, విద్యానగర్, లంగర్ హౌస్, బేగంపేట, మారేడ్ పల్లి, తిరుమలగిరి, బోయిన్ పల్లి, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీనగర్, భోలక్ పూర్, చిక్కడపల్లి, చిలకలగూడ, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది.
కొన్నిచోట్ల ఈదురుగాలులు తీవ్రస్థాయిలో వీయడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బందిపడ్డారు. అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ వర్షం పడింది.