ఈ ఐదు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు మండిపోతాయట!

  • దేశంలో కొనసాగుతున్న వేసవి తీవ్రత
  • మరో 2 డిగ్రీల వరకు వేడిమి పెరుగుతుందన్న ఐఎండీ
  • 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి
దేశంలో ఈసారి అత్యధిక స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల్లో 2 డిగ్రీల వరకు వేడిమి తీవ్రత పెరగనుందని తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతాయని ఐఎండీ వివరించింది. 

ముఖ్యంగా, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని హెచ్చరించింది. మే తొలి వారం వరకు తీవ్ర వేడిమి పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. ఆ తర్వాతే ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్కే జనమణి వెల్లడించారు.


More Telugu News