తెలుగు అకాడమీ కేసు.. వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం!
- తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- రూ. 92.94 కోట్లను ఏపీకి చెల్లించాలని ఆదేశం
- 6 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశాలు జారీ
తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా వారం రోజుల్లోగా చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు అనుమతిని ఇచ్చింది.
ఏపీకి చెల్లించాల్సిన రూ. 92.94 కోట్ల పెండింగ్ సొమ్మును వారంలోగా ఇవ్వాలని చెప్పింది. 6 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశించింది. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. విభజన చట్టం ప్రకారం తెలుగు అకాడమీ నిధులు, సిబ్బందిని 42:58 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది.