మసీదులపై లౌడ్ స్పీకర్ ప్రాథమిక హక్కు కాదు: అలహాబాద్ హైకోర్టు
- మసీదుపై లౌడ్ స్పీకర్ ఏర్పాటు కోసం దరఖాస్తు పెట్టుకున్న ఇర్ఫాన్
- అనుమతి ఇవ్వని ఆ ప్రాంత సబ్ కలెక్టర్
- హైకోర్టులో ఛాలెంజ్ చేసిన ఇర్ఫాన్
- రాజ్యాంగ హక్కుగా చట్టం చెప్పడం లేదంటూ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మసీదులపై లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు నడుస్తున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లౌడ్ స్పీకర్లు ప్రాథమిక హక్కు కానే కాదని స్పష్టం చేసింది.
ఇర్ఫాన్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లా పరిధిలో దొరన్ పూర్ గ్రామంలోని నూరి మసీదుపై లౌడ్ స్పీకర్ ఏర్పాటు కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. దీనికి సబ్ కలెక్టర్ (ఎస్ డీఎం) అనుమతి ఇవ్వలేదు. ఎస్ డీఎం ఆదేశాలు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, చట్టపరమైన హక్కులకు వ్యతిరేకమంటూ ఇర్ఫాన్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.
వాదనలు విన్న జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ వికాస్ తో కూడిన ధర్మాసనం.. మసీదులపై లౌడ్ స్పీకర్ల వినియోగం రాజ్యాంగపరమైన హక్కు కాదని చట్టం చెబుతోందంటూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ ను కొట్టివేసింది.