"ప్లీజ్ నన్ను పాస్ చేయండి సర్.. లేదంటే మా నాన్న పెళ్లి చేస్తాడు".. బోర్డు పరీక్షల్లో రాసిన విద్యార్థిని
- హర్యానాలో పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షల మూల్యాంకనం
- జవాబు పత్రాల్లో విద్యార్థులు రాసిన విజ్ఞప్తులు చర్చనీయాంశం
- తమను ఎలాగైనా పాస్ చేయాలని బతిమిలాడుతూ రాతలు
తమను పరీక్షల్లో పాస్ చేయాలని కోరుతూ ప్రశ్నపత్రాల్లో కొందరు విద్యార్థులు విచిత్ర ధోరణి కనబర్చారు. దయచేసి తమకు పాస్ మార్కులు వేయాలని కొందరు కోరితే, మరికొందరు మంచి మార్కులు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఈ ఘటనలు హర్యానాలో పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో చోటు చేసుకున్నాయి.
తన తండ్రి బాగా తాగుతాడని, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురవుతున్నానని ఓ విద్యార్థిని రాసింది. తనకు ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఉందని, అయితే, ఈ పరీక్షల్లో 75 శాతం మార్కులు రాకపోతే తన తండ్రి పెళ్లి చేస్తానని చెప్పాడని జవాబు పత్రాల్లో పేర్కొంది. కూతురిలా భావించి తనను పాస్ చేయాలని కోరింది. మరో విద్యార్థి.. తనకు ప్రశ్నకు సమాధానం తెలియదని, దయచేసి పాస్ మార్కులు వేయాలని పేర్కొన్నాడు.
తాను మంచి విద్యార్థిని అని రాశాడు. మరికొందరు విద్యార్థులు కూడా ఈ విధంగానే రాసి తమను ఎలాగైనా పాస్ చేయాలని కోరారు. దీనిపై విద్యాశాఖాధికారి దయానంద్ సింగ్ మాట్లాడుతూ.. కొందరు విద్యార్థులు జవాబు పత్రాలపై ఇటువంటి రాతలు రాస్తున్నారని, పరీక్షల్లో ఇటువంటివి రాయకూడదని టీచర్లు తరగతి గదిలోనే విద్యార్థులకు చెప్పాలని అన్నారు. కాగా పశ్చిమ బెంగాల్ లోనూ ఇటీవల చాలా మంది విద్యార్థులు జవాబు పత్రాల్లో ఇటువంటి రాతలే రాయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.