రెండెకరాల భూమి, రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను కోరిన సత్యంబాబు!
- ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా బయటపడ్డ సత్యంబాబు
- చేయని తప్పుకు తొమ్మిదేళ్లు శిక్షను అనుభవించిన వైనం
- తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన సత్యంబాబు
బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు నుంచి సత్యంబాబు నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సత్యంబాబు చాలా కాలంపాటు జైలు జీవితాన్ని గడిపాడు. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో తనకు 2 ఎకరాల సాగు భూమి, రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను కోరాడు. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించినందున పరిహారం ఇవ్వాలని ఈ రోజు స్పందన కార్యక్రమంలో విన్నవించాడు.
చేయని నేరానికి తొమ్మిదేళ్లు జైలు శిక్షను అనుభవించానని... ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరాడు. ఆయేషా మీరా హత్య కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. కింది కోర్టు విధించిన జీవితఖైదు, జరిమానాలను రద్దు చేసింది. ఖర్చుల కింద సత్యంబాబుకు రూ. లక్ష చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.