'బోట్' నుంచి కళ్లు చెదిరే తొలి స్మార్ట్ వాచ్ విడుదల

  • 1.39 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే
  • హార్ట్ రేటు, ఎస్పీవో2 ఎంతుందో తెలుసుకోవచ్చు
  • మొదటి వెయ్యి మంది కస్టమర్లకు రూ.3,999కే ఆఫర్
  • ఆ తర్వాత నుంచి ధర రూ.4,499
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల నుంచి చూపు స్మార్ట్ వాచ్ లపైకి వెళుతోంది. ఎందుకంటే ప్రతీ విషయానికి స్మార్ట్ ఫోన్ ను చేతిలోకి తీసుకునే అవసరం లేకుండా.. కాల్స్ చేసుకోవడం, కాల్స్ స్వీకరించడం, మెస్సే జ్ వస్తే చూసుకోవడం.. ఇలా చాలా పనులను స్మార్ట్ వాచ్ నుంచే చేసుకోవచ్చు. పైగా వీటిని చేతికి ధరించడం వల్ల అందానికి అదనపు ఆకర్షణ తోడవుతుంది. దీంతో యువత ఎక్కువగా స్మార్ట్ వాచ్ ల వైపు అడుగులు వేస్తోంది. 

ప్రముఖ వేరబుల్ డివైజెస్ సంస్థ బోట్.. ప్రీమియా పేరుతో తొలి బ్లూటూత్ స్మార్ట్ వాచ్ ను ఆవిష్కరించింది. రేడియంట్ మెటాలిక్ డిజైన్, గుండ్రటి డయల్, లెదర్ స్ట్రాప్ తో చూడ్డానికి ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 1.39 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. పెద్ద స్పీకర్ తో వస్తుంది. గుండె రేటు ఎంత, రక్తంలో ఆక్సిజన్ (ఎస్ పీవో2) శాతం ఎంత ఉందో ఒక్క బటన్ తో చూపిస్తుంది. ఒత్తిడి ఎదుర్కొంటుంటే అది ఏ స్థాయిలో ఉంది, కేలరీలు ఎంత ఖర్చు చేసిందీ కూడా చెబుతుంది. ఐపీ67 డస్ట్, స్వెట్, స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. దీంతో ఎటువంటి వాతావరణంలో అయినా దీన్ని ధరించొచ్చు.

బ్లూటూత్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ధర రూ.4,499. అయితే మొదటి వెయ్యి మంది కస్టమర్లకు (కంపెనీ వెబ్ సైట్, అమెజాన్ ద్వారా) దీన్ని రూ.3,999కే ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆ తర్వాత నుంచి రూ.4,499 అందుబాటులో ఉంటుంది. బ్లాక్, బ్లూ స్ట్రాప్ రంగులతో ఈ వాచ్ లభిస్తుంది.


More Telugu News