ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్గా సక్సేనా బాధ్యతల స్వీకరణ
- ఢిల్లీకి 22వ లెఫ్ట్నెంట్ గవర్నర్గా సక్సేనా
- ఇటీవలే నియమించిన రాష్ట్రపతి
- ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్గా పని చేసిన సక్సేనా
దేశ రాజధాని ఢిల్లీ నూతన లెఫ్ట్నెంట్ గవర్నర్గా నియమితులైన వినయ్ కుమార్ సక్సేనా గురువారం పదవీ ప్రమాణం చేశారు. ఢిల్లీకి 22వ లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఆయన ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే. మొన్నటిదాకా ఈ పదవిలో కొనసాగిన అనిల్ బైజాల్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని బైజాల్ తెలిపారు.
బైజాల్ రాజీనామాతో ఖాళీ అయిన ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ పదవిలో కొత్తగా వినయ్ కుమార్ సక్సేనాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. మొన్నటిదాకా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్గా ఆయన పనిచేశారు.