వైసీపీ పాలకుల అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయాలంటే ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి?: పవన్ కల్యాణ్ వ్యంగ్యం
- అవినీతి నిర్మూలనకు యాప్ తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
- 'ఏసీబీ 14400' పేరిట యాప్
- అవినీతి నిరోధానికి విప్లవాత్మక మార్పు అన్న జగన్
- సెటైర్ వేస్తూ జనసేనాని ట్వీట్
ఏపీ ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం 'ఏసీబీ 14400' మొబైల్ యాప్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ కు సమాచారం ఇస్తే అవినీతి అక్రమార్కుల భరతం పడతామని ప్రభుత్వం చెబుతోంది. ఈ యాప్ ను ప్రజలు డౌన్ లోడ్ చేసుకునేలా విరివిగా ప్రచారం చేస్తోంది. అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని, అవినీతి నిరోధానికి ఇదొక విప్లవాత్మక మార్పు అని సీఎం జగన్ పేర్కొన్నారు.
దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. మరి వైసీపీ పాలకుల అవినీతి గురించి, వారి ఎమ్మెల్యేల దోపిడీ, దౌర్జన్యాల గురించి ఫిర్యాదు చేయాలంటే ప్రజలు ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.