నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ పై ఢిల్లీలో కేసులు

  • మరి కొందరు వ్యక్తులపైనా కేసు నమోదు
  • ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు
  • ప్రజల్లో శాంతికి భగ్నం కలిగిస్తున్నారంటూ అభియోగాలు
ఢిల్లీ పోలీసులు బీజేపీ బహిష్కృత నేతలైన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ తదితరులపై కేసు నమోదు చేశారు. విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న అభియోగాలను వారిపై మోపారు. ద్వేషపూరిత వ్యాఖ్యలతో ప్రజల్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారంటూ ఆరోపించారు. ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ విభాగం (ప్రత్యేక సెల్) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతలు వివాదాస్పదంగా మాట్లాడడం తెలిసిందే. 

‘‘వివిధ మతాలకు సంబంధించిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. తప్పుడు, అసత్య సమాచారాన్ని ప్రోత్సహించే విషయంలో సోషల్ మీడియా సంస్థల పాత్రపైనా విచారణ చేయనున్నాం’’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్హ, నవీన్ కుమార్ జిందాల్, షదాబ్ చౌహాన్, సబా నఖ్వి, మౌలానా ముఫ్తి నదీమ్, అద్దుర్ రెహమాన్, గులామ్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా షకున్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 



More Telugu News