మాజీ మంత్రి పేర్ని నానిపై సొంత పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయిందన్న బాలశౌరి
- సొంత నియోజకవర్గంలో ఎంపీకి తిరిగే హక్కు లేదా? అంటూ ప్రశ్న
- టీడీపీ నేత కొనకళ్లతో అధికార పార్టీ ఎమ్మెల్యేకు పనేంటన్న ఎంపీ
- తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు భయపడనన్న బాలశౌరి
వైసీపీలో కీలక నేత, మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానిపై అదే పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని బాలశౌరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గంలో ఎంపీకి తిరిగే హక్కు లేదా అని కూడా ఆయన ప్రశ్నించారు.
అసలు టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నానికి పనేంటని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే వైసీపీ ఏ దారి పడుతుందో ప్రజలకే అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై తాను బందరులోనే ఉంటానని చెప్పిన బాలశౌరి.. ఎవరేం చేస్తారో చూస్తానని వ్యాఖ్యానించారు. తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు తాను భయపడబోనని కూడా బాలశౌరి మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.