పదో తరగతిలో మ్యాథ్స్ లో 36 మార్కులు.. ఇప్పుడు జిల్లా కలెక్టర్ 

  • ఇంగ్లిష్ లోనూ 35 మార్కులే
  • సైన్స్ లో అయితే 38 మార్కులు
  • అయినా ఉన్నత ఉద్యోగం సంపాదించిన తుషార్ సుమేరా
‘కృషి ఉంటే సాధించలేనిది లేదు’ ఈ సామెత వినే ఉంటారు. సానుకూల దృక్పథం ఉండాలే కానీ, లక్ష్యాలను, కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పడానికి ఇదే నిదర్శనం. గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్ జిల్లా కలెక్టర్ తుషార్ సుమేరా విజయగాథ కూడా ఇటువంటిదే. ఆయన పదో తరగతి మార్కుల మెమో ట్విట్టర్ లోకి చేరింది. ఇది ఇప్పుడు నెటిజన్ల హృదయాలను తాకుతోంది. ఎందుకంటారా..? పదో తరగతి మ్యాథ్స్ లో ఆయనకు వచ్చింది 36 మార్కులే. 

ఈ మార్కుల షీట్ ను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ షేర్ చేశారు. తుషార్ సుమేరాకు పదో తరగతిలో ఇంగ్లిష్ లో కేవలం పాస్ మార్కులు 35 వచ్చాయి. మ్యాథ్స్ లో 36, సైన్స్ లో కూడా 38 మార్కులు మించలేదు. ఈ ఫోటోతో పాటు.. పక్కన బరూచ్ కలెక్టర్ కార్యాలయంలో ఆసీనులైన తుషార్ సుమేరా ఫొటోను అవనీశ్ శరణ్ పోస్ట్ చేశారు. 

మంచి మార్కుల సాధన దిశగా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చే వారికి ఇదొక కనువిప్పు లాంటిదే. ఉన్నత లక్ష్యాల సాధనకు మార్కులు కొలమానం కానే కాదని ఇది తెలియజేస్తోంది. ఈ కథనం ఎంతో మందికి స్ఫూర్తినీయంగా అనిపిస్తోంది. దాంతో ట్విట్టర్లో ఎంతో మంది తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు.


More Telugu News