బాగా ఆడావు సోదరా.. దినేష్ కార్తీక్ కు పాండ్యా ప్రశంస
- 'ఎంతో మందికి స్ఫూర్తినిచ్చావు' అంటూ ప్రశంసలు
- భారత్ కోసం ఆడటమే లక్ష్యమని చెప్పావన్న పాండ్యా
- నేడు అది నేరవేరవడం పట్ల సంతోషంగా ఉందంటూ కామెంట్
టీమిండియా స్టార్ ఆటగాడు హార్థిక్ పాండ్యా.. తన సహచరుడు దినేష్ కార్తీక్ ను ప్రశంసించాడు. దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్ లో చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ దంచికొట్టుడు కార్యక్రమంతో కేవలం 27 బంతుల్లోనే 55 పరుగులు పారించాడు. ప్రతి బంతికీ రెండేసి పరుగులు చొప్పున రాబట్టి.. భారత్ 169 భారీ స్కోరు సాధించడంలో అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలోనే సీనియర్ వికెట్ కీపర్ అయిన దినేష్ కార్తీక్ ఆటతీరును పాండ్యా మెచ్చుకున్నాడు. దినేష్ కార్తీక్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నట్టు చెప్పాడు. ‘‘నిజాయతీగా చెబుతున్నాను. ఎంతో మందికి నీవు స్ఫూర్తినిచ్చావు. నీ సంభాషణలు నాకు గుర్తున్నాయి. భారత్ కోసం మళ్లీ ఆడటమే నా లక్ష్యమని చెప్పావు. నీవు దాన్ని సాధించడం పట్ల ఆనందంగా ఉంది. ఎంతో మంది కొత్తవి నేర్చుకోబోతున్నారు. బాగా ఆడారు సోదరా.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది’’ అని పాండ్యా పేర్కొన్నాడు. మైదానంలో వీరిద్దరి సంభాషణ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ పేజీలో పంచుకుంది.