గిరిజన బిడ్డలపై మీకు ఎందుకింత కోపం?.. వీడియో పోస్ట్ చేస్తూ ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- మంచిర్యాల జిల్లాలో ఘటన
- గిరిజనులను గుడిసెల నుంచి తరలించిన పోలీసులు
- తిరస్కరించిన గిరిజన మహిళను ఈడ్చేసిన పోలీసులు
తెలంగాణలో పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను అక్కడి నుంచి తరలించే క్రమంలో ఓ మహిళను పోలీసులు ఈడ్చివేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన బిడ్డలపై మీకు ఎందుకింత కోపం కేసీఆర్? అంటూ ఆయన తెలంగాణ సర్కారుపై ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ ద్వారా ఫాం హౌజుల కోసం, బినామీ కంపెనీల కోసం వేల ఎకరాలను ప్రభుత్వం ఆక్రమిస్తోందని ఆయన ఆరోపించారు. బతుకుదెరువు కోసం గిరిజన మహిళలు పోడు చేసుకుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పోడు సాగు చేస్తున్న గిరిజనులు అక్కడే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వీరు పోడు భూములను ఆక్రమించారంటూ పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే యత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులను వారి గుడిసెల నుంచి బలవంతంగా తరలించే యత్నం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఓ మహిళ తన గుడిసె నుంచి వెళ్లిపోయేందుకు నిరాకరించగా... ఆమెను మహిళా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గిరిజన మహిళ దుస్తులు ఊడిపోతున్నా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.