షిండే శివసేనకు 11.. బీజేపీకి 29.. మహారాష్ట్రలో మంత్రి పదవులపై ఢిల్లీలో చర్చలు!
- ఢిల్లీలో పర్యటిస్తున్న ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో 40 నిమిషాలకుపైగా భేటీ
- ఎవరికి ఎన్ని మంత్రి పదవులు అన్న దానిపై చర్చలు
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, బీజేపీ రాష్ట్ర చీఫ్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ జాతీయ నేతలతో సమావేశమై.. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలను చర్చిస్తున్నారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ ఇద్దరూ 40 నిమిషాలకుపైగా భేటీ అయి చర్చించారు.
షిండే వర్గానికి కీలక శాఖలు ఇస్తూ..
మహారాష్ట్రలో ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఇద్దరు మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. మిగతా మంత్రులందరినీ నియమించాల్సి ఉంది. ఈ క్రమంలో తిరుగుబాటు చేసి వచ్చిన ఏక్ నాథ్ షిండే వర్గానికి 11 మంత్రి పదవులు, బీజేపీకి 29 మంత్రి పదవులు తీసుకుందామని బీజేపీ ప్రతిపాదించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నారు.
అత్యంత కీలకమైన సీఎం పదవిలో ఇప్పటికే షిండే ఉన్నారు. దానితోపాటు హోంశాఖను కూడా షిండే వర్గానికే ఇస్తామని ప్రతిపాదించినట్టు రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. సంఖ్యా పరంగా చూసినా బీజేపీకి వంద మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండటం, షిండే వర్గం అందులో సగమే కావడంతో.. మంత్రి పదవుల సంఖ్యలో సింహ భాగం బీజేపీకి దక్కడం ఖాయమని పేర్కొంటున్నాయి.