జేఈఈ మెయిన్స్ ఫలితాల విడుదల.. 100 పర్సెంటైల్ సాధించిన వారిలో సగం మంది తెలుగు విద్యార్థులే!

  • జేఈఈ మెయిన్స్ లో 14 మంది విద్యార్థులకు 100 పర్సెంటైల్
  • వీరిలో నలుగురు తెలంగాణ, ముగ్గురు ఏపీ విద్యార్థులు
  • జులై 21 నుంచి 30 వరకు రెండో సీజన్ పరీక్షలకు అప్లై చేసుకోవచ్చు
జేఈఈ మెయిన్స్ తొలి సీజన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. jeemain.nta.nic.in వెబ్ సైట్ లో స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారు. వీరిలో టాపర్ తో పాటు మరో ఏడు మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. 

పెనికలపాటి రవికిశోర్ (ఆంధ్రప్రదేశ్), ధీరజ్ (తెలంగాణ), రూపేశ్ బియానీ (తెలంగాణ), జాస్తి యశ్వంత్ (తెలంగాణ), అనికేత్ చటోపాధ్యాయ్ (తెలంగాణ), పోలిశెట్టి కార్తికేయ (ఆంధ్రప్రదేశ్), కొయ్యన సుహాస్ (ఆంధ్రప్రదేశ్) లు ఈ 14 మందిలో ఉన్నారు. జులై 21 నుంచి 30 వరకు జేఈఈ రెండో సీజన్ పరీక్షలకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.


More Telugu News