సెన్సార్ సర్టిఫికెట్ కూడా తెచ్చేసుకున్న 'ది వారియర్'
- లింగుసామి ఫస్టు తెలుగు మూవీగా 'ది వారియర్'
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న రామ్
- రేడియో జాకీ పాత్రను పోషించిన కృతిశెట్టి
- ఈ నెల 14వ తేదీన సినిమా విడుదల
ఈ మధ్య కాలంలో మాస్ యాక్షన్ సినిమాలపై మనసు పారేసుకున్న రామ్, తన తాజా చిత్రంగా 'ది వారియర్' చేశాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలారు. U/A సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇక థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. రామ్ ఫస్టు టైమ్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ఇది. ఇక రేడియో జాకీగా కృతి శెట్టి కనిపించనుంది.
దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు మాస్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యాయి. చాలా కథల తరువాత ఈ కథకి ఓకే చెప్పడం జరిగిందని రామ్ చెబుతున్నాడు. అంత ప్రత్యేకత ఈ కథలో ఏముందనేది ఆసక్తికరంగా మారింది. .
తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలారు. U/A సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇక థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. రామ్ ఫస్టు టైమ్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ఇది. ఇక రేడియో జాకీగా కృతి శెట్టి కనిపించనుంది.
దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు మాస్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యాయి. చాలా కథల తరువాత ఈ కథకి ఓకే చెప్పడం జరిగిందని రామ్ చెబుతున్నాడు. అంత ప్రత్యేకత ఈ కథలో ఏముందనేది ఆసక్తికరంగా మారింది.