శరీరంలో సత్తువను పెంచి.. బలహీనతను దూరం చేసే ఆహార పదార్థాలివిగో..!
- ఎంత తింటున్నామనేది కాకుండా.. ఏం తింటున్నామో చూడాలంటున్న నిపుణులు
- నారింజ, బెర్రీస్, సోయా, డ్రైఫ్రూట్స్, చేపలు, అరటి పండ్లు వంటివి తీసుకోవాలని సూచన
- వాటితో దేహానికి బలంతోపాటు మానసిక ఆరోగ్యానికీ ప్రయోజనమని వెల్లడి
రోజూ పొద్దున లేచినప్పటి నుంచి అర్ధరాత్రి దాకా ఎన్నో పనులు. శరీరం అలసిపోతుంది. మరోవైపు మారిన ఆహార అలవాట్లతో సరైన పోషకాలు అందని పరిస్థితి. అలిసిపోయి బలహీనపడిన శరీరం తిరిగి పునరుత్తేజం కావాలంటే.. దానికి తగిన ఆహారం అవసరం. శరీరంలో సత్తువ ఉండాలంటే.. ఎంత తింటున్నామనేది కాకుండా ఏం తింటున్నాం, ఏయే సమయాల్లో తింటున్నామన్నది ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కేవలం శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కలిగించే, మెదడుకూ శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు.
మనం నిత్యం తినే ఆహారంలో భాగమైనవే..
దేహానికి బలాన్ని ఇచ్చే ఆహారం అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండవని.. మనం నిత్యం తీసుకునే ఆహారంలో భాగమైన వాటిలో మంచివి ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఈ ఆహార పదార్థాలు మన శక్తి స్థాయులపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయని, రోజువారీ జీవితం సాఫీగా సాగిపోతుందని అంటున్నారు. సత్తువను పెంచుకోవడానికి తోడ్పడే ఆహార పదార్థాలు, వాటి ప్రత్యేకతలను వివరిస్తున్నారు.
బెర్రీ పండ్లు
రేగు పళ్లు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, క్రాన్ బెర్రీస్ వంటి బెర్రీ జాతికి చెందిన పండ్లు అత్యుత్తమ పోషకాలకు నిలయం. వాటిలోని విటమిన్ సి, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి శరీరానికి సత్తువను ఇస్తాయి. మనం తరచూ తినే తీపి పదార్థాలకు ప్రత్యామ్నాయంగా బెర్రీస్ ను తీసుకోవడం వల్ల ఇటు చెడు పదార్థాలను దూరం పెట్టినట్టు ఉంటుందని, అటు శరీరానికి మంచి జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఆకుల్లాంటి కూరగాయలు (క్రూసిఫెరస్ వెజిటబుల్స్)
ఆకుపచ్చగా ఆకుల తరహాలో ఉండే గ్రీన్ లీఫీ కూరగాయలతో శరీరానికి మంచి శక్తి అందుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్రకొలీ, కాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, కేల్ వంటివి క్రూసిఫెరస్ కూరగాయలు అని.. వాటినే మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ గా పిలుచుకుంటామని వివరిస్తున్నారు. ఈ కూరగాయల్లో ప్రోటీన్లు, ఇనుము, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలమని.. శరీరానికి మంచి సత్తువను ఇస్తాయని అంటున్నారు.
సోయాబీన్స్
సోయాబీన్స్ అందరికీ తెలిసిన సాధారణ కూరగాయల్లో ఒకటి. కానీ మాంసం, పాలు వంటి జంతు పదార్థాలు కాకుండా.. శాకాహారంలో మనకు ఎక్కువగా ప్రోటీన్లను అందించే ప్రధాన పోషకాహారం సోయాబీన్. దీనిని మనం తోఫు (సోయా పనీర్), సోయా మిల్క్ మొదలైన వివిధ రూపాల్లో కూడా తీసుకోవచ్చు.
గింజలు, డ్రైఫ్రూట్స్
మనం టీవీ చూస్తూనో, ఏదో పని చేస్తూనో, ఆఫీసు పని మధ్యలోనో స్నాక్స్ తింటూ ఉంటాం. అవి ఆరోగ్యానికి చెడు చేస్తాయి. వాటికి బదులుగా డ్రైఫ్రూట్స్, వివిధ రకాల గింజలను స్నాక్స్ గా తీసుకుంటే శరీరానికి మంచి శక్తిని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ వంటివి తీసుకుంటే.. రోజంతా తగిన శక్తిని అందిస్తాయని అంటున్నారు.
కాఫీతోనూ చురుకుగా..
అప్పటికప్పుడు తగిన ఉత్తేజాన్ని శక్తిని ఇచ్చేందుకు కాఫీ తోడ్పడుతుంది. మిగతా ఆహార పదార్థాల నుంచి శక్తి ఉత్పత్తి కావడానికి సమయం తీసుకుంటే.. కాఫీ మాత్రం తక్షణ శక్తిని అందిస్తుంది. దీనికి కారణం కాఫీలో ఎక్కువగా ఉండే కేఫీన్ రసాయనమే. ఇది రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది, మెదడు పనితీరును ఉత్తేజితం చేసి.. ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అయితే పరిమితికి మించి కాఫీ తాగడం మాత్రం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రీన్ టీతోనూ ఎనర్జీ
శరీర సత్తువను వేగంగా పెంచడానికి గ్రీన్ టీ కూడా తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. దీనిలోనూ కెఫీన్ ఉంటుందని.. దానికి అదనంగా జీవ క్రియలు సాఫీగా సాగేందుకు తోడ్పడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని వివరిస్తున్నారు.
నిమ్మ, నారింజ జాతి పండ్లు
నారింజ, నిమ్మకాయలు, ఆ జాతి (సిట్రస్ రకం) పండ్లు కూడా శరీరానికి వేగంగా శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా ఎండాకాలం వంటి సమయంలో ఇవి బాగా ఉపకరిస్తాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. బద్ధకాన్ని నివారిస్తుంది.
చేపలు
చేపలు ఎన్నో రకాల పోషకాలకు నిలయం. ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్ బీ ఎక్కువ. మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే చేపలను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వీటిలో అధిక మొత్తంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో మెరుగైన శక్తి ఉత్పత్తికి తోడ్పడతాయి.
అరటి పండ్లు
అరటిపండ్లు మరొక గొప్ప శక్తి వనరు. వ్యాయామం ఎక్కువగా చేసే వ్యక్తులు అరటిపండ్లను ఎక్కువగా తీసుకుంటుంటారు కూడా. ఎందుకంటే వీటిలో ఫైబర్, పొటాషియం ఎక్కువ. పొటాషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. మీ శక్తిని పెంచడం ద్వారా వ్యాయామం స్థాయిని మెరుగుపరుస్తుంది.
డార్క్ చాక్లెట్
కాఫీ తరహాలోనే డార్క్ చాక్లెట్ మీ శరీరానికి తక్షణ ఉత్సాహాన్ని అందిస్తుంది. ఎన్నో పోషకాలతో సూపర్ ఫుడ్ డార్క్ చాక్లెట్. శరీరంలో రక్త ప్రసరణను, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. తద్వారా శక్తిని పెంచుతుంది. అయితే ఎక్కువగా చక్కెర కలిపిన చాక్లెట్లకు మాత్రం దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ అంశాలనూ గుర్తుంచుకోండి
మీరు తినే ఆహారం మీ శరీరంలో శక్తి స్థాయులను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. కానీ శరీరంలో సత్తువను మరెన్నో అంశాలు కూడా ప్రభావితం చేస్తాయని.. కేవలం ఆహారంలో మార్పు చేస్తే సరిపోదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర, విశ్రాంతి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి శరీరంలో శక్తి స్థాయిని పెంచడానికి తోడ్పడతాయని స్పష్టం చేస్తున్నారు.