సినిమా షూటింగుల నిలిపివేతపై స్పందించిన నిర్మాత సి.కల్యాణ్
- సమస్యలతో చిత్ర పరిశ్రమ సతమతం
- ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్న కల్యాణ్
- ఈ నెల 27న సమావేశం ఉంటుందని వెల్లడి
- కమిటీ సిఫారసుల మేరకు ముందుకెళతామని స్పష్టీకరణ
సినీ రంగంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి షూటింగుల నిలిపివేతకు ఇటీవల ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు. చిత్ర పరిశ్రమ సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, ఫిలిం చాంబర్ అధ్యక్షుడి నేతృత్వంలో జులై 27న ప్రత్యేక కమిటీ సమావేశం ఉంటుందని వెల్లడించారు.
కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుందో పరిశీలించాల్సి ఉందని, దాన్నిబట్టే షూటింగుల నిలిపివేత కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే సినిమా షూటింగుల బంద్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తమ మధ్య అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు.