బీజేపీలో చేరిన మ‌హిళా న్యాయ‌వాది ర‌చ‌నా రెడ్డి, 'రైస్ మిల్ల‌ర్స్' ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోహ‌న్ రెడ్డి

  • ఇటీవ‌లే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మోహ‌న్ రెడ్డి
  • భువ‌న‌గిరిలో బీజేపీలో చేరిన రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
  • బీజేపీలోకి సాద‌రంగా ఆహ్వానించిన షెకావత్‌
తెలంగాణ‌లో బీజేపీలోకి చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర మూడో విడ‌త ప్రారంభం సంద‌ర్భంగా భువ‌న‌గిరిలో ఏర్పాటు చేసిన వేదిక మీద తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ మ‌హిళా న్యాయ‌వాది ర‌చ‌నా రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ఆమెను పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే... ఇటీవ‌లే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌డ్డి మోహ‌న్ రెడ్డి కూడా మంగ‌ళ‌వారం ఇదే వేదిక‌పై బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. బోధ‌న్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న టీఆర్ఎస్ నేత ష‌కీల్ కార‌ణంగా నియోజ‌కవ‌ర్గంలో టీఆర్ఎస్ బ‌ల‌హీన‌ప‌డింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మోహ‌న్ రెడ్డి... నియోజక‌వ‌ర్గ ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని కూడా చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మోహ‌న్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి బీజేపీలో చేరిపోయారు.


More Telugu News