73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
- ఇంగ్లండ్ రాయల్ వన్డే కప్ లో మెరుపు సెంచరీ
- ఒకే ఓవర్లో 22 పరుగులు బాదిన చటేశ్వర్
- అయినా తన జట్టు ససెక్స్ ను గెలిపించలేకపోయిన పుజారా
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్కా టెస్టు ఆటతో గంటల కొద్ది క్రీజులో ఉండటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఓర్పుగా, నెమ్మదిగా ఆడటం అతని నైజం. అలాంటి వ్యక్తి తనలోని విధ్వంసకర బ్యాటర్ ను తట్టి లేపాడు. ఒక్కసారిగా టీ20 స్టయిల్లో బ్యాటింగ్ చేసి 73 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో గ్రూప్-ఏలో భాగంగా వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా నుంచి ఈ మెరుపు సెంచరీ వచ్చింది. మొత్తంగా అతను 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. కానీ, తాను నాయకత్వం వహిస్తున్న ససెక్స్ జట్టుకు విజయం అందించలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. పుజారా, అలిస్టర్ ఓర్(81) సత్తా చాటడంతో సులభంగా గెలిచేలా కనిపించింది. పైగా 47వ ఓవర్లో పుజారా 22 పరుగులు రాబట్టాడు. లియామ్ నార్వెల్ వేసిన ఈ ఓవర్లో పుజారా 4,2,4,2,6,4 బాదాడు. కానీ, తర్వాతి ఓవర్లో అతను ఔటవడంతో ససెక్స్ జట్టుకు ఓటమి తప్పలేదు.