జబర్ధస్త్ నుంచి బయటకు రావటానికి గల కారణం చెప్పిన అనసూయ

  • సినిమాల్లో నటనపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్టు ప్రకటన
  • జబర్దస్త్ తనకు ఇష్టమైన షో అని చెప్పిన అనసూయ
  • సినిమాల కారణంగా సమయం కేటాయించలేక పోతున్నానని వెల్లడి
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తాను జబర్దస్త్ వంటి అత్యంత పాప్యులర్ షో నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వెల్లడించింది. జబర్ధస్త్ షోకు మొదటి నుంచి అనసూయ యాంకర్ గా సేవలు అందించడం తెలిసిందే. ఈ షోకు ప్రజాదరణలో అనసూయ పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవాల్సిందే. ఆమె అందచందాలు, హావభావాలు, వ్యాఖ్యానం షోకు అదనపు ఆకర్షణనిస్తాయి. అలాంటి షోను వీడి రావడం వెనుక తనకు ఎదురైన అనుభవాలను ఆమె బయటపెట్టింది.

షోలో భాగంగా తనపై వేసే పంచులు నచ్చడం లేదని ఆమె చెప్పింది. పంచులు నచ్చక ఎన్నో సందర్భాల్లో ముఖం మాడ్చుకున్నానని, అవేవీ షోలో కనిపించవని తెలిపింది. తనకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు నచ్చవన్న అనసూయ.. క్రియేటివ్ ఫీల్డ్ అన్న తర్వాత ఇలాంటివి తప్పదని నిట్టూర్చింది. కానీ, ఇదే ఊబిలో చిక్కుకుపోవాలని తాను అనుకోవడం లేదని ఆమె పేర్కొంది. 

జబర్దస్త్ నుంచి బయటకు రావాలని రెండేళ్లుగా అనుకుంటున్నట్టు చెప్పింది. అంతేకానీ, నాగబాబు, రోజాగారు షో నుంచి వెళ్లిపోయారని చెప్పి, తాను కూడా బయటకు రాలేదని పేర్కొంది. నటనపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు తెలిపింది. తనకు జబర్దస్త్ షో అంటే ఎంతో ఇష్టమంటూ.. సినిమాల్లో నటన కారణంగా, జబర్దస్త్ కు సమయం కుదరడం లేదని పేర్కొంది.


More Telugu News