100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతున్న 'కార్తికేయ 2'
- ఈ నెల 13న విడుదలైన 'కార్తికేయ 2'
- తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయి రెస్పాన్స్
- హిందీలో 15 కోట్లకి పైగా వసూళ్లు
- 75 కోట్ల మార్క్ ను దాటేసిన సినిమా
నిఖిల్ - చందూ మొండేటి కాంబినేషన్లో రూపొందిన 'కార్తికేయ 2' ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఆ రహస్యం ఏమిటన్నది తెలుసుకోవడానికి ద్వారకలో హీరో సాగించే అన్వేషణే ఈ సినిమా కథ.
విడుదలైన తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్ లో ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వచ్చింది. తొలి రోజున అక్కడ 200 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 3వ రోజుకి 700 థియేటర్లకి వెళ్లింది. 'శ్రీకృష్ణ జన్మాష్టమి' రోజున ఈ సినిమాకి అమాంతంగా వసూళ్లు పెరిగిపోయాయి.
ఇంతవరకూ ఒక్క హిందీలోనే 15 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 75.33 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. త్వరలో ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయమని చెబుతున్నారు. తెలుగు వెర్షన్ వరకూ చూసుకుంటేనే, నిఖిల్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలిచింది.