'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నుంచి బ్యూటిఫుల్ సాంగ్!
- ఇంద్రగంటి నుంచి మరో విభిన్న కథా చిత్రం
- సుధీర్ బాబు సరసన నాయికగా కృతి శెట్టి
- సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్
- వచ్చేనెల 16వ తేదీన సినిమా రిలీజ్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన సుధీర్ బాబు, మూడో సినిమాగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కొంతకాలం క్రితమే విడుదలకి ముస్తాబైంది. కాకపోతే సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగును రిలీజ్ చేశారు. "అల్లంత దూరాన నువ్వు నీ కళ్లు నన్నే చూస్తుంటే ఏం చేయాలో, రవ్వంత గారంగ నాలోని నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో" అంటూ ఈ పాట సాగుతోంది. హీరో హీరోయిన్ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై .. ప్రేమలో తొలి అడుగులు వేస్తున్న సందర్భంలో వచ్చే పాట ఇది.
వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. ట్యూన్ .. సాహిత్యం రెండూ కూడా మనసుకు పట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట ఈ ఆల్బమ్ కి హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. వెన్నెల కిశోర్ .. అవసరాల శ్రీనివాస్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 16వ తేదీన విడుదల కానుంది.