కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
- మార్కెట్లలో బ్లాక్ మండే
- మానిటరీ పాలసీని కఠినతరం చేస్తామన్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో పతనమవుతున్న మార్కెట్లు
- 1,034 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ రోజు బ్లాక్ మండే కొనసాగుతోంది. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1,034 పాయింట్లు పతనమై 57,815కి పడిపోయింది. నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 17,258కి దిగజారింది.
దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్ లు భారీగా నష్టపోయాయి. ఐటీ సూచీ భారీగా నష్టపోతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మానిటరీ పాలసీని కఠినతరం చేస్తామంటూ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు ప్రకటించడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ కారణంగానే ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఐటీ సూచీ 3.56 శాతం, టెక్ సూచీ 3.26 శాతం, మెటల్ సూచీ 2.41 శాతం పతనమయ్యాయి.