ఏపీవ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశాలు... ఇంచార్జీలను ప్రకటించిన సోము వీర్రాజు
- సమావేశాల రాష్ట్ర ఇంచార్జీగా విష్ణువర్ధన్ రెడ్డి
- నాలుగు ప్రాంతాలకు నలుగురు ఇంచార్జీలు
- ఉత్తర్వులు జారీ చేసిన సోము వీర్రాజు
ఏపీలో బీజేపీ సరికొత్త సమావేశాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. స్ట్రీట్ కార్నర్ సమావేశాల పేరిట జరపనున్న ఈ సమావేశాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించే ఈ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సమావేశాల నిర్వహణ కోసం పార్టీ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డిని రాష్ట్ర ఇంచార్జీగా నియమిస్తున్నట్లు వీర్రాజు ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు ప్రాంతాల్లో నిర్వహించే సమావేశాలకు నలుగురు ఇంచార్జీలను నియమించారు. ఉత్తరాంధ్రకు పరశురామ్ రాజు, కోస్తాంధ్రకు కోలా ఆనంద్, గోదావరి జిల్లాలకు తపన చౌదరి, రాయలసీమకు పనతల సురేశ్‌ను నియమిస్తూ వీర్రాజు ఉత్తర్వులు జారీ చేశారు.