పైనాపిల్ వినాయకుడికి నైవేద్యంగా 1,116 కిలోల లడ్డూ.. వీడియో ఇదిగో
- తుమ్మలగుంటలో పైనాపిల్ పండ్లతో వినాయక ప్రతిమ
- చెవిరెడ్డి ఆధ్వర్యంలోనే పైనాపిల్ వినాయకుడి విగ్రహం ఏర్పాటు
- 1,116 కిలోల లడ్డూను ఉచితంగా భక్తులకు పంపిణీ చేస్తామన్న చంద్రగిరి ఎమ్మెల్యే
శ్రీ బాలాజి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినాయక చవితిని పురస్కరించుకుని పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన నియోజకవర్గ పరిధిలోని తుమ్మలగుంటలో పైనాపిల్ పండ్లతో భారీ వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడికి తాజాగా 1,116 కిలోల భారీ లడ్డూను నైవేద్యంగా పెట్టారు.
వెయ్యి నూట పదహారు కిలోల భారీ లడ్డూను పైనాపిల్ వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన వీడియోను చెవిరెడ్డి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భారీ లడ్డూను వేలం వేయబోమని, పైనాపిల్ వినాయకుడి నిమజ్జనంలో పాలుపంచుకునే భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెవిరెడ్డి తెలిపారు.