బిగ్ బాస్ వేదికపై సందడి చేసిన రణబీర్, అలియా

  • ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-6
  • రణబీర్, అలియాలకు స్వాగతం పలికిన నాగ్
  • తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచిన రణబీర్
  • ఏకంగా తెలుగులో పాట పాడిన అలియా
బిగ్ బాస్ సీజన్-6 ఓపెనింగ్ ఎపిసోడ్ లో బ్రహ్మాస్త్రం జోడీ రణబీర్ కపూర్, అలియా భట్ సందడి చేశారు. వీరిద్దరినీ హోస్ట్ నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రణబీర్ కపూర్ తెలుగులో మాట్లాడడం విశేషం. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులకు మంచి పేరుందని, తాము నటించిన బ్రహ్మాస్త్రం చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరారు. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 

అనంతరం, అలియా తెలుగులో ఓ పాట పాడి అందరినీ అలరించింది. బ్రహ్మాస్త్రం చిత్రంలోని పాటను ఆమె ఎంతో హృద్యంగా ఆలపించింది. ఈ సందర్భంగా, బ్రహ్మాస్త్రం ప్రోమోను బిగ్ బాస్ స్క్రీన్ పై ప్రదర్శించారు. ఆ బాలీవుడ్ జోడీకి నాగ్ శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మాస్త్రం చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ వేదిక నుంచి వీడ్కోలు తీసుకుంటూ రణబీర్... నాగ్ కు పాదాభివందనం చేశాడు.


More Telugu News