ఢిల్లీలో 28 అడుగుల నేతాజీ విగ్రహం.. ఖమ్మం నుంచి 100 అడుగుల పొడవైన ట్రక్ లో గ్రానైట్ రాయి తరలింపు
- ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో కొలువైన నేతాజీ ఏక శిలా విగ్రహం
- 280 మెట్రిక్ టన్నుల గ్రానైట్ రాయి వినియోగం
- నేడు ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణ
ఢిల్లీలోని ఇండియాగేట్ సమీపంలో ఏర్పాటు చేసిన 28 అడుగుల పొడవైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించనున్నారు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నేతాజీ 125వ జయంతి సందర్భంగా దీన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ఈ ఏడాది జనవరి 23న (పరాక్రమ్ దివస్) ఇచ్చిన హామీని నేరవేర్చబోతున్నారు.
ఇది ఏక శిలా విగ్రహం. 280 మెట్రిక్ టన్నుల బ్లాక్ గ్రానైట్ రాయిని ఇందుకోసం ఉపయోగించారు. మైసూరుకు చెందిన ఐదో తరం శిల్పి అరుణ్ యోగిరాజ్, అయన బృందం ఈ బాధ్యతను తీసుకుంది. విగ్రహాన్ని చెక్కేందుకు 26,000 గంటల సమయం పట్టింది. తుది విగ్రహం బరువు 56 మెట్రిక్ టన్నులు. ఈ మోనోలిథిక్ గ్రానైట్ రాయిని ఖమ్మం జిల్లా నుంచి 140 చక్రాలతో కూడిన 100 అడుగుల పొడవాటి ట్రక్ లో 1,665 కిలోమీటర్ల దూరంలోని ఢిల్లీకి తరలించారు.