తెలంగాణలో 833 ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్.. ఈ నెల 29 నుంచి దరఖాస్తులు
- నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
- పూర్తి వివరాలను https://www.tspsc.gov.in/ లో తెలుసుకోవచ్చని వెల్లడి
- సెప్టెంబర్ 29వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రకటన
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) మొత్తంగా 833 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంటూ ప్రకటన జారీ చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది.
ఈ పోస్టుల కోసం సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. పోస్టులు, అర్హతలు, ఇతర పూర్తి వివరాల కోసం టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో తెలుసుకోవచ్చని వెల్లడించింది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.