భారీ ధరకు చిరంజీవి 'గాడ్ ఫాదర్' డిజిటల్ రైట్స్
- అక్టోబర్ 5న విడుదలవుతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్'
- రూ. 57 కోట్లకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్
- అనంతపురంలో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు గత సినిమా 'ఆచార్య' నిరాశపరిచినప్పటికీ... ఈ చిత్రంపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయింది.
తాజాగా సినిమా ఓటీటీ రైట్స్ సైతం భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ రూ. 57 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు, హిందీ వర్షన్ లకు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించినట్టు సమాచారం. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసే పనిలో పడింది. అనంతపురం వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.