అలా జరిగి ఉంటే 'బాహుబలి'లో రాజమాతగా చేసి ఉండేదానినేమో: జయచిత్ర
- సీనియర్ హీరోయిన్ గా జయచిత్రకు మంచి పేరు
- రీసెంట్ గా 'పొన్నియిన్ సెల్వన్'లోను మెరిసిన నటి
- 'మంగమ్మగారి మనవరాలు' సీరియల్ గురించిన ప్రస్తావన
- అది చేయకపోవడం పట్ల అసంతృప్తి
70వ దశకంలో గ్లామరస్ హీరోయిన్ గా తెలుగు తెరపై సందడి చేసినవారిలో జయచిత్ర ఒకరిగా కనిపిస్తారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె పవర్ఫుల్ అత్త పాత్రలలోను మెప్పించారు. శోభన్ బాబు .. కృష్ణ .. కృష్ణంరాజు వంటి హీరోలతో ఆమె ఆడిపాడారు. రీసెంట్ గా ఆమె 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలోను మెరిశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లేదానిని. కానీ ఒక సీరియల్లో అవకాశం చేజారిపోవడం నాకు చాలా బాధను కలిగించింది. ఆ సీరియల్ పేరే 'మంగమ్మగారి మనవరాలు'. రాఘవేంద్రరావుగారి ఫ్యామిలీకి చెందినవారే ఆ సీరియల్ చేశారు. ఆ సీరియల్ కి సంబంధించిన విషయాలను మాట్లాడటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అదే సమయంలో నేను ఫోన్లో అదే సీరియల్ కథను వింటున్నాను.
ఈ లోగానే వచ్చినవారిలో ఒకరు, నేను సీరియల్ చేయనన్నాననీ, ఫారిన్ వెళ్లిపోయే ఉద్దేశంతో ఉన్నానని నేను అక్కడ ఉండగానే అవతలివారికి చెప్పేశాడు. రాజమౌళి గారి గెస్టు హౌస్ లో ఉంటూ ఆ సీరియల్ చేయడానికి నేను ఒప్పుకున్నప్పటికీ, రాఘవేంద్రగారికి లేనిపోనివి చెప్పారు. అలా ఆ ప్రాజెక్టులో నేను లేకుండా పోయాను. ఆ సీరియల్ కి సంబంధించిన లింక్ దొరికి ఉంటే, 'బాహుబలి' సినిమాలో రాజమాత పాత్ర నాకు దక్కి ఉండేదేమో. ఇన్ని సినిమాలు చేసిన నాకు ఒక సీరియల్ ఇలా మిస్సయిందే అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.