24 గంటలు సమయం ఇస్తా... ఆరోపణలు నిజమని నిరూపించగలవా?: కేటీఆర్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్
- రాజగోపాల్ రెడ్డిపై క్విడ్ ప్రో కో ఆరోపణలు చేసిన కేటీఆర్
- తీవ్రంగా స్పందించిన రాజగోపాల్ రెడ్డి
- కేటీఆర్ కు 24 గంటల సమయం ఇస్తున్నానని వెల్లడి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిందని, అందుకు ప్రతిగా ఆయన బీజేపీలో చేరారని, ఇది క్విడ్ ప్రో కో అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకునే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
"కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు బహిరంగ సవాల్ విసురుతున్నా. నీకు 24 గంటల సమయం ఇస్తున్నా. నాపై చేసిన క్విడ్ ప్రో కో ఆరోపణలు నిజమని నిరూపించు... లేకపోతే పరువునష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు" అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, రాజకీయ విమర్శల పర్వం ఊపందుకుంది. మునుగోడులో బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తుండగా, అధికార టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.