ఇవాళ బాలీవుడ్ కు ముస్లింలే విశేషంగా సేవలందిస్తున్నారు: శరద్ పవార్
- నాగపూర్ లో ముస్లిం మైనారిటీలతో పవార్ సమావేశం
- బాలీవుడ్ ఉన్నతికి ముస్లింలే కారణమన్న పవార్
- ముస్లింలు అసంతృప్తి చెందడంలో తప్పేమీలేదని వెల్లడి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగపూర్ లో ఆయన ముస్లిం మైనారిటీ వర్గాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాలీవుడ్ కు ప్రస్తుతం ముస్లింలే విశేష రీతిలో సేవలందిస్తున్నారని తెలిపారు.
కళలు, ఉర్దూలో సాహిత్యం, రచనలు... ఇలా అనేక విధాలుగా ముస్లిం సమాజం తన భాగస్వామ్యాన్ని అపారంగా చాటుకుంటోందని వెల్లడించారు. ఇవాళ బాలీవుడ్ ఈ స్థాయిలో ఉందంటే ముస్లిం మైనారిటీల సహాయసహకారాలే ప్రధాన కారణమని శరద్ పవార్ ఉద్ఘాటించారు.
దేశంలో అతిపెద్ద వర్గాల్లో ఒకటిగా ఉన్న ముస్లింలు తమకు రావాల్సిన వాటా రావడంలేదన్న అసంతృప్తితో ఉన్నారని, వారు అసంతృప్తి చెందడంలో తప్పేమీలేదని శరద్ పవార్ అన్నారు. వారు తమ వాటాను ఎలా పొందాలన్నదానిపై చర్చ జరగాలని సూచించారు. ముస్లింలు ప్రతిభాపాటవాలు ఉన్న వ్యక్తులని, అయితే వారికి మద్దతు, సమాన అవకాశాలు అవసరమని అభిప్రాయపడ్డారు.