ఇరాన్ మహిళలకు మద్దతు పలికిన ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఆగ్రహం

  • ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం
  • ఉద్యమిస్తున్న ఇరాన్ మహిళలు
  • వారిని ధైర్యవంతులుగా అభివర్ణించిన ప్రియాంక చోప్రా
  • బిల్కిస్ బానో గురించి ఎందుకు మాట్లాడడంలేదన్న నెటిజన్లు
  • ప్రియాంక మోసగత్తె అంటూ వ్యాఖ్యలు
ఇరాన్ లో మహిళలు హిజాబ్ వ్యతిరేక ఉద్యమం కొనసాగిస్తుండడం తెలిసిందే. యునిసెఫ్ సౌహార్ద రాయబారిగా కొనసాగుతున్న ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఈ సందర్భంగా ఇరాన్ మహిళలకు మద్దతు పలికారు. వారిని ధైర్యవంతులైన మహిళలుగా అభివర్ణించారు. 

అయితే, ఇరాన్ మహిళలకు మద్దతు పలుకుతుండడం పట్ల సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రాపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను మోసగత్తెగా పేర్కొంటూ విమర్శిస్తున్నారు. 

భారత్ లో ఎంతో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచార ఘటనపై ప్రియాంక చోప్రా ఎందుకు స్పందించడంలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. ముస్లింలపై ప్రభుత్వం సాగిస్తున్న అణచివేతపై ప్రియాంక ఎందుకు గళం వినిపించడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఎంతగానో వివక్షకు గురవుతున్న మహిళలపై మౌనంగా ఉండడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News