ఢిల్లీ లిక్కర్ స్కామ్... వైసీపీ ఎంపీ కుమారుడిని విచారిస్తున్న సీబీఐ
- లిక్కర్ స్కామ్ దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ
- మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు
- హైదరాబాద్, విజయవాడ, గుంటూరుల్లో సీబీఐ తనిఖీలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో 10 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
మరోవైపు ఈ కేసు విచారణకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా హాజరయ్యారు. సిసోడియాతో పాటు అరుణ్ పిళ్లైని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది. మాగుంట కుమారుడిని ప్రశ్నిస్తుండటం ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ఫార్మా కంపెనీ ఎండీని సైతం సీబీఐ విచారిస్తోంది.