ఓటు వేయని నల్లారి, చిరంజీవి... ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్
- దేశవ్యాప్తంగా 96 శాతం పోలింగ్ నమోదు
- ఢిల్లీ, ఛండీగఢ్ లలో వంద శాతం పోలింగ్ నమోదు
- ఏపీలో 350 మందికి గాను 300 మందే ఓటేసిన వైనం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల దాకా కొనసాగింది. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీకి చెందిన నేతలు ఉత్సాహంగా పోలింగ్ లో పాలుపంచుకున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో 96 శాతం ఓట్లు పోలయ్యాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏకంగా 100 శాతం ఓట్లు పోలయ్యాయి. అదే విధంగా ఛండీగఢ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోనూ వంద శాతం పోలింగ్ నమోదైంది.
ఇదిలా ఉంటే... కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీకి చెందిన నేతలంతా క్యూ కడితే... ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఏపీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 350 మంది ఓటర్లు ఉండగా... వారిలో కేవలం 300 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.