లోన్ యాప్ వేధింపులకు యువకుడి ఆత్మహత్య
- ఇంట్లోని తన గదిలో ఉరేసుకున్న యువకుడు
- లోన్ యాప్ వేధింపులతో పోయిన మరో ప్రాణం
- వనపర్తి జిల్లా కొత్తకోటలో దారుణం
లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం పోయింది.. తీసుకున్న అప్పు మొత్తం చెల్లించినా వేధింపులు ఆపకపోవడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పండుగనాడే ఇంట్లో ఉరేసుకుని తనువు చాలించాడు. వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలు.. కొత్తకోటకు చెందిన శేఖర్ కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాడు. అత్యవసరంగా డబ్బు కావాల్సిన పరిస్థితుల్లో ఓ లోన్ యాప్ ను ఆశ్రయించాడు. వారి నుంచి సొమ్ము తీసుకుని వాడుకున్నాడు. అవసరం తీరిన తర్వాత వడ్డీ డబ్బులతో కలిపి లోన్ యాప్ సంస్థకు తిరిగి చెల్లించాడు.
తీసుకున్న సొమ్ము మొత్తం చెల్లించినా లోన్ యాప్ నిర్వాహకుల నుంచి శేఖర్ కు వేధింపులు ఆగలేదు. వడ్డీల పేరుతో ఇంకా బాకీ ఉన్నావంటూ ఫోన్ లు, మెసేజ్ లు చేస్తున్నారు. బాకీ ఉన్న మొత్తం వెంటనే చెల్లించకపోతే శేఖర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. దీంతో వాళ్లు అడిగిన సొమ్ము చెల్లించేందుకు శేఖర్ సిద్ధపడ్డాడు. డబ్బుల కోసం ప్రయత్నిస్తుండగానే లోన్ యాప్ నిర్వాహకులు శేఖర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించారు.
ఆపై వాటిని సోషల్ మీడియాలోనూ అప్ లోడ్ చేశారు. ఇది చూసి మనస్తాపానికి లోనైన శేఖర్.. సోమవారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఉరేసుకుని చనిపోయాడు. శేఖర్ మరణానికి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.