రోహిత్‌శర్మను కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. రూ. 6.5 లక్షల జరిమానా.. వీడియో ఇదిగో!

  • భారత్-జింబాబ్వే మ్యాచ్ జరుగుతుండగా ఘటన
  • భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి వచ్చిన అభిమాని
  • రోహిత్‌ను చూస్తూనే కన్నీళ్లు
రోహిత్‌శర్మను కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. రూ. 6.5 లక్షల జరిమానా.. వీడియో ఇదిగో!
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు సూపర్-12 గ్రూప్-2లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ నెల 10న ఇంగ్లండ్‌తో జరగనున్న సెమీస్ సమరానికి సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. భారత్‌కు చెందిన ఓ అభిమాని తన ‘హీరో’ రోహిత్ శర్మను కలవాలని అనుకున్నాడు. అంతే.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. 

గమనించిన  భద్రతా సిబ్బంది అతడి వెనక పరుగులు తీసి మొత్తానికి పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను చూస్తూనే అభిమాని ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే, అతడు రోహిత్‌ను కలవకముందే సిబ్బంది అతడిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, మైదానంలోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించిన ఆ అభిమానిపై రూ. 6.5 లక్షల జరిమానా విధించారు.


More Telugu News