'బిగ్ బాస్ హౌస్' నుంచి నేను బయటికి రావడానికి కారణం అదేనంటే ఒప్పుకోను: గీతూ
- 'బిగ్ బాస్ హౌస్' నుంచి ఎలిమినేట్ అయిన గీతూ
- తన ఆటతీరు జననానికి నచ్చలేదేమోనని ఆవేదన
- బాలాదిత్య విషయంలో తాను చేసినది తప్పుకాదని వ్యాఖ్య
- తనకి నిజంగానే ఓసీడీ ఉందని వెల్లడి
'బిగ్ బాస్ హౌస్'లో తనదైన ఆటతీరుతో గీతూ చాలామంది అభిమానులను సంపాదించుకుంది. చిత్తూరు యాస .. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం .. నేనింతే అన్నట్టుగా వ్యవహరించడం చాలామందికి నచ్చింది. అలాంటి గీతూ ఫైనల్స్ వరకూ వెళుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె నిన్న ఎలిమినేట్ అయింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన ఎలిమినేషన్ గురించి ప్రస్తావిస్తూ .. "బిగ్ బాస్ హౌస్ లో ప్రతి నిమిషం గెలవడం కోసమే ఆడాను. కానీ జనానికి నేను నచ్చలేదేమో. నాలోని లోపాలను సరి చేసుకుంటూనే వస్తున్నాను. అయినా బయటికి రావలసి వచ్చింది" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
"హౌస్ లో అందరితో పెద్దగా స్నేహం ఏర్పడటానికి ముందు నేను కాస్త దూకుడుగా మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఆ తరువాత నా లోని లోపాలను నాగార్జున గారు చెబుతూ ఉంటే సరిదిద్దుకుంటూ వచ్చాను. బాలాదిత్య సిగరెట్లు - లైటర్ దాచేసినందుకు నన్ను ఆయన చాలా మాటలు అన్నాడు. నేను నటిస్తున్నానని ఆయన అనడం నాకు చాలా బాధ కలిగించింది. అందువల్లనే గేమ్ పూర్తయిన వెంటనే కూడా తిరిగి ఆయనకి లైటర్ - సిగరెట్లు ఇవ్వలేదు. ఆటపరంగా నేను వాదన చేస్తాను గానీ, పర్సనల్ గా ఎవరినీ టార్గెట్ చేయను" అంది.
"బాలాదిత్యను ఏడిపించిన కారణంగానే నేను బయటికి రావలసి వచ్చిందంటే మాత్రం నేను ఒప్పుకోను. అలాగే చేపల టాస్క్ లో సంచాలక్ గా నేను వ్యవహరించిన తీరు తప్పంటే కూడా అంగీకరించను. నేను బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను కనుక ఇలా ప్రవర్తించలేదు. నా తీరే అంత ... ఇక్కడ దాచుకోవడానికీ .. నటించడానికి ఏమీ లేదు. మొదటి నుంచి కూడా నాకు ఓసీడీ ఉంది. ఎవరి ఎంగిలిని నేను తాకను ... తినను. అందువల్లనే నేను కిచెన్ లో పనిచేయనని చెప్పింది. ఎప్పటికప్పుడు తప్పుని తప్పు అని చెబుతూ వచ్చాను. నా నుంచి నేర్చుకోవలసినది ఏదైనా ఉందంటే అది ఇదే" అంటూ చెప్పుకొచ్చింది.