ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటన పట్ల స్పందించిన గవర్నర్ తమిళిసై
- హైదరాబాదులో ఎంపీ అర్వింద్ నివాసంపై దాడి
- టీఆర్ఎస్ పై మండిపడుతున్న బీజేపీ
- దాడిని ఖండించిన గవర్నర్
- ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదని వెల్లడి
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి జరగడం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీని కోరారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ట్విట్టర్ లో వెల్లడించింది.
కల్వకుంట్ల కవితను పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి చేశారని సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించగా, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే, హైదరాబాద్ లోని అర్వింద్ నివాసంపై దాడి జరిగినట్టు భావిస్తున్నారు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు, అర్వింద్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.